మహేష్ కోసం అదిరిపోయే టైటిల్ పెట్టిన సుకుమార్..!!

0
46
Mahesh Babu-Sukumar's next film update1
Mahesh Babu-Sukumar's next film update1

రంగస్థలం సినిమా తో ఫుల్ జోష్ లో ఉన్న సుకుమార్ తన తదుపరి సినిమాని మహేష్ బాబు తో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతుండగా, త్వరలో భారీగా సినిమా ప్రారంభోత్సవం కానుంది..

వీరి కలయిక లో గతంలో నేనొక్కడినే సినిమా రాగ ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.. ఈ సారి మంచి కంటెంట్ తో రావాలని సుకుమార్ మహేష్ ని ఓ మంచి సబ్జెక్టు తో ఒప్పించినట్లు తెలుస్తుంది.. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమా వేసవి లో రిలీజ్ అవుతుంది.. పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు..

కాగా సుకుమార్, మహేష్ బాబు సినిమా కి టైటిల్ గా ‘ హర హర మహాదేవ’ టైటిల్ ని పరిశీలిస్తున్నారట.. టైటిల్ కి తగ్గట్లే సినిమా కథ సోసియో ఫాంటసి అని అంటున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇటీవలే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో మహేష్ సినిమా కె ఈ టైటిల్ అంటూ ప్రచారం జరుగుతుంది.. మరి సుకుమార్ , మహేష్ సినిమాకు టైటిల్ ఇదేనా లేదా అనేది ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here