బన్నీ సినిమా కూడా కాపీనే.. త్రివిక్రమ్ పని అయిపోయిందా..!!

60
copy issue on trivikram bunny movie
copy issue on trivikram bunny movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు ఎంత క్రేజో అందరికి తెలిసిందే.. అయన మొదటి సినిమా స్వయంవరం దగ్గరినుంచి అరవింద సమేత సినిమా వరకు అన్ని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చినవే.. ముఖ్యంగా అయన మాటలకు అభిమానులు చాల మందే ఉన్నారు.. అందుకే ప్రతి హీరో ఆయనతో పనిచేయనుకునే వారు.. అయన డైలాగ్స్ ఒక్కటైనా చెప్పాలని ప్రతి నటులు అనుకుంటున్నారు.. ఎందుకంటే అయన పెన్ను అంత పవర్ ఫుల్.. అలాంటి పెన్ను ఇప్పుడు చిన్నబోయినట్లు కనిపిస్తుంది.. మొదట్లో త్రివిక్రమ్ నుంచి జాలువారిన పదాలు ఇప్పుడు రానని మొరాయిస్తున్నాయేమో.. మునుపటి పంచులు, డైలాగ్స్ ఇప్పటి అయన సినిమాల్లో కనిపించట్లేదు.. మాటలే కాదు సినిమా కథలు కూడా ఎక్కడో చూసి కాపీ కొడుతున్నాడు..

నితిన్ ‘అఆ’ సినిమా ఒక నవల కు కాపీ అన్న సంగతి తెలిసిందే.. అది నవల రచయిత కు క్రెడిట్ కూడా ఇవ్వలేదని అప్పట్లో పెద్ద ఇష్యూ కూడా అయ్యింది.. అది తర్వాత చేసిన అజ్ఞాతవాసి సినిమా కూడా ఓ ఇంగ్లీష్ సినిమాకి కాపీ.. ఇక రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత సినిమా హిట్ అయినా త్రివిక్రమ్ మార్క్ పెద్దగా కనిపించలేదు.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తుండగా అది సినిమా కథ ఎలా ఉంటుందో అని అందరు ఎదురుచూశారు.. కానీ అది సినిమా కథ కూడా ఓ ఇంగ్లీష్ సినిమా ప్రేరణ అంట.. దాంతో త్రివిక్రమ్ పెన్నులో ఇంకు అయిపోయిందని అందుకే ఇలా ఇతర కథలని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాలు చేస్తున్నాడని సోషల్ మీడియా లో సెటైర్లు పడుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here