నోరుజారిన కాజల్.. తలలు పట్టుకున్న దర్శకనిర్మాతలు..!!

120
kajal told secret of teja movie
kajal told secret of teja movie

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. వీరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.. తేజ లక్ష్మి కళ్యాణం సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది కాజల్.. ఆ తర్వాత వరుస సినిమా లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పెద్ద హీరోలు సైతం కాజల్ తో చేయాలనుకునేవారే.. తాజగా బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తుంది..

తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెట్స్ పై ఉంది.. త్వరలో రిలీజ్ కానుంది.. అయితే సినిమా టైటిల్ ని కాజల్ రివీల్ చేసింది. తిరుపతి లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ నోరుజారి సినిమా టైటిల్ ని సీత అని చెప్పేసింది. దాంతో ఎంతో సీక్రెట్ గా ఉంచిన ఈ టైటిల్ ని ఇలా చెప్పేయడంతో తేజ తలలు పట్టుకున్నాడట.. టైటిల్ ని కూడా ఎంతో గ్రాండ్ గా రివీల్ చేయాలనుకున్న తేజ కి ఇలా అయ్యేసరికి కాజల్ పై కోపం కూఆ వచ్చిందట.. తన మొదటి సినిమా లో సీన్ కోసం కాజల్ ని కొట్టిన తేజ ఇప్పుడు ఎం చేస్తాడో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here