ఛార్మి తో అండర్ స్టాండింగ్ వల్లే రామ్ పూరి తో సినిమా చేస్తున్నాడా..!!

115
reason for puri jagannadh and ram movie
reason for puri jagannadh and ram movie

పూరి జగన్నాధ్ సూపర్ హిట్ సినిమా చేసి చాలా రోజులే అయిందని చెప్పాలి.. ఎన్టీఆర్ తో టెంపర్ తరువాత ఒక్క హిట్ కూడా పూరి ఖాతాలో లేదంటే ఎంత వెనుక బడి ఉన్నాడో చెప్పనవసరం లేదు.. పూరి తో సినిమా కోసం ఒకప్పుడు ఎగబడే స్టార్ హీరోలు ఇప్పుడు పూరి పేరు వినిపిస్తే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాప్ లో ఉన్న రామ్ పూరి తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు..

రామ్ గత సినిమా హలో గురు ప్రేమకోసమేరో సినిమా అంతగా ఆడలేదు.. బిలో యావరేజ్ గా నిలిచింది.. ఇలాంటి టైం లో రామ్ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయాలి కానీ పూరి తో సినిమా చేయడం అయన అభిమానులకు అంతగా నచ్చలేదు.. అసలే కారణంతో సినిమా ఒప్పుకున్నాడు అని అందరు తెగ ఆలోచిస్తున్నారు.. అయితే రామ్ పూరి తో మ్యూచువల్ కాంప్ర మైజ్ కారణంగానే సినిమా ని ఒప్పుకున్నాడని తెలుస్తుంది..పూరి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే ఛార్మి తో బిజినెస్ షేర్ చేయాలనే డీల్ కారణంగానే ఈ సినిమా కు ఒప్పుకున్నాడట రామ్..

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here