నాగార్జున కి సమస్య గా మారిన చైతన్య, అఖిల్.!!

121

అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్ కి వచ్చిన నాగార్జున ఆనతి కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు దూసుకుపోతున్న రోజుల్లో తనకంటూ ఓ మాస్ , క్లాస్ ఇమేజ్ ని ఏర్పరుచుకుని నాగార్జున ఓ ట్రెండ్ సెట్ చేశాడు.. ఆ తర్వాత కూడా హిట్స్ తో దూసుకెళ్తూ తన తర్వాతి తరం వాళ్లకు మార్గదర్శకం అయ్యాడు.. సోలో హీరో గానే కాకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ సినిమా లోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు..

నాగార్జున తన వారసులను కూడా సినీ ఇండస్ట్రీ లో పరిచయం చేసి తాను కూడా మెల్ల మెల్లగా సినిమా లు చేస్తున్నాడు. అయితే ఇక్కడే నాగార్జున కి పెద్ద చిక్కొచ్చి పడింది.. పెద్దబ్బాయి నాగచైతన్య గాడిలో పడ్డట్లే పడి ప్రస్తుతం ఫ్లాప్ లతో సతమవుతున్నాడు.. యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలతో వరుస ఫ్లాప్ లతో వెనకపడి పోయాడు.. అటు అఖిల్ కి కూడా ఇంత వరకు సరైన హిట్ పడలేదు. తొలి రెండు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి..

ఇటు చూస్తే అయన పరిస్థితి కూడా అంతగా బాలేదు. అయన గత రెండు సినిమాలు ఆఫీసర్ , దేవదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో తన కెరీర్ ని చక్కదిద్దుకుంటూ అటు కొడుకుల కెరీర్ ను చక్కదిద్దే ప్రయత్నంలో నాగార్జున చాలా ఇబ్బందిపడిపోతున్నాడట… మరి నాగార్జున ఇబ్బందులు తీరాలంటే ఇద్దరి కొడుకులు హిట్ ట్రాక్ లో పడాలి.. అది జరగాలని ఆశిద్దాం..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here