కెజిఎఫ్ 2 వచ్చేది అప్పుడే.. ఈసారి సోలోగా..!!

435
KGF 2 movie plans summer release
KGF 2 movie plans summer release
ట్రైలర్ తోనే అందరిలో ఆసక్తి రేకెత్తించిన కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యాక ప్రభంజనం సృష్టించింది.. హీరో యాష్ ఇండియా మొత్తం మంచి పేరొచ్చింది.. తన యాక్టింగ్ స్టైల్, మ్యానరిజం అందరికి ఫుల్ గా ఎక్కేశాయి.. రిలీజ్ అయ్యి పది రోజులు దాటుతున్న సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదంటే ఈ సినిమా ఏ స్థాయి హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. ఈ సినిమా చూశాక కెజిఎఫ్ 2 ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు..
 
ఈ సినిమా ని సమ్మర్ లో ప్లాన్ చేశారట నిర్మాతలు.. మే లో ఏ సినిమాలు లేని టైం లో ఈ సినిమా ని రిలీజ్ చేసి మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారట.. అయితే అసలు సినిమా కెజిఎఫ్ 2  లో నే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెప్తుంది.. గరుడ ని చంపిన తర్వాత రాకీ బంగారు గనులను ఎలా స్వాధీనం చేసుకున్నాడు.. ఇతర శత్రువుల నుండి ఎలా దాన్ని రన్ చేశాడు.. ప్రధానమంత్రి స్వయంగా చంపమని ఆర్డర్ ఇచ్చేనంతగా రాకీ ఎం చేశాడనేది సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారట.. మరి వీటికి సమాధానాలు దొరకాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here