కత్తిలాంటి ఛాన్స్ కొట్టేసిన కైరా అద్వానీ..!!

186
kairaadvani for bunny movie
kairaadvani for bunny movie
భరత్ అను నేను సినిమా తో అరంగేట్రం లోనే లక్కీ ఛాన్స్ కొట్టేసిన కైరా అద్వానీ రెండో సినిమా తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తుంది.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కాబోతుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.. అయితే కైరా అద్వానీ మరో బంపర్ ఆఫర్ ఇప్పుడు వరించింది..
 
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో లో రాబోతున్న సినిమా లో హీరోయిన్ గా ఈ ముంబై భామ ఛాన్స్ కొట్టేసింది.. గీత ఆర్ట్స్ సంస్థ , హారిక & హాసిని సంస్థ లు సంయుక్తంగా ఈ సినిమా ని నిర్మిస్తున్నాయి.. తండ్రి కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషనల్ కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది..  అరవింద సమేత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here