చంద్రబాబు బాటలో మమతా బెనర్జీ..!!

0
27
manatha benerji follows chandrababu
manatha benerji follows chandrababu

తమ అనుమతి లేకుండా ఎపి లో సిబిఐ సోదాలు, దర్యాప్తు చేయడానికి వేయలేదని ఎపి ముఖ్యమంత్రి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు చంద్రబాబు బాటలోనే మమతా బెనర్జీ నడుస్తున్నట్లు తెలుస్తుంది.. పశ్చిమ బెంగాల్ లో అనుమతి తీసుకోకుండా ఎలాంటి సిబిఐ సోదాలు, దర్యాప్తు చేయడానికి వీల్లేదని చెప్పేసింది.. అందుకు కలిగి ఉన్న ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు సచివాలయ ఉన్నతాధికారి తెలిపారు.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టం కింద పనిచేసే పనిచేసే సిబిఐ అధికార పరిధి ఢిల్లీ వరకే ఉంది.. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సమ్మతి అవసరం.. సిబిఐ ని అనుమతించకుండా చంద్రబాబు మంచి చేసారని మమతా బెనర్జీ అన్నారు.. బిజెపి తన ప్రతీకార చర్యలను తీర్చుకోవడానికి సిబిఐ, ఇతర సంస్థల లను ఉపయోగించుకుంటోందని అన్నారు.. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు.. చంద్రబాబు నిర్ణయానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కితాబిస్తున్నారు.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బాబు చేసింది సరైన పనే అని కితాబునిచ్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here