రాజకీయాల్లోకి హీరో రామ్.. వైరల్ అవుతున్న పోస్ట్..!!

0
43
హీరో రామ్ ఎప్పుడు కామ్ గానే ఉండడం చూసాం.. ఎలాంటి వివాదాలకు వెళ్ళకుండా తన సినిమలేవో తను చేసుకుంటూ ఇండస్ట్రీ మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తాజాగా అయన నటించిన ‘ హలో గురు ప్రేమకోసమే’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.. కాగ అయన రీసెంట్ గా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. తెలంగాణాలో ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. 
 
దానిలో భాగంగానే నటుడు రామ్ ఓటు హక్కు వినియోగం పై తన స్పందన తెలిపారు. ఓటు హక్కు ఉన్నవారందరూ ఎన్నికలలో వారి హక్కును వినియోగించుకోవాలని అన్నారు రామ్… అయితే నిజాయితి పరుడైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన అన్నాడు. రాజకీయాలలోకి ప్రజాసేవ చేయగలిగే వారు రావాలి కానీ, అందులో వయోపరిమితి ఏమి ఉండదని, 20 నుండి మొదలుపెడితే 60లు దాటకైనా రాజకీయాలలోకి రావచ్చని, కానీ నిబద్దత, చురుకుతనంతో పనిచేయాలంటే యువత రావడం అవసరం అన్నాడు. నాయడుకిగా అనుభవం ఉన్నవారైతే ఇంకా మంచిది అన్నాడు రామ్. ఈవిధంగా రామ్ సామజిక మాధ్యమాలలో స్పందించడం ప్రస్తుతం వైరల్ అయ్యింది.ఇంతకీ ఈ మాటలు ఎందుకు అన్నట్టో.. రాజకీయాలలోకిగాని వస్తాడేమో.. వచ్చినా రావచ్చు..చెప్పలేం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here