తెలుగులోకి అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తున్న లారిస్సా బొనేసి..!!

0
138

సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అందాల బ్రెజిల్ భామ లారిస్సా బొనేసి.. సైఫ్ అలీ ఖాన్ హీరో గా ‘గో గోవా గాన్’లో తళుక్కున మెరిసిన ఈ చందమామ ఇప్పటికే పలు యాడ్స్ లో, కనిపించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమాతోనే తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. తన అభినయం, గ్లామర్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది..

తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ ఏంటి సినిమా లో సెకండ్ లీడ్ చేస్తున్న లారిస్సా ఈ సినిమా లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. తన పాత్ర తోనే ఈ సినిమా మలుపు తిప్పడంతో హీరోయిన్ పాత్ర కాకపోయినా ఈ పాత్రను ఒప్పుకుంది.. ఈ సినిమా తో తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో లారిస్సా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది.. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమైన లారిస్సా ఈ సారి మరింత చేరువై స్టార్ హీరో ల సినిమా లు దక్కించుకోనుంది..

సోషల్ మీడియా లో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే లారిస్సా హాట్ హాట్ ఫోటో షూట్ లతో, క్రేజీ స్టిల్స్ తన అభిమానులను అలరిస్తుంది.. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఉండేలా చూస్తూ అభిమానులను ఉర్రుతలూగిస్తుంది.ఏదేమైనా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమా తో మనముందుకు రాబోతున్న లారిస్సా కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అనిపిస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here