దేవి కూడా అంతేనా.. అచ్చం దించేసాడుగా సాంగ్స్..!!

37
devisriprasad copy tunes in HGPK
devisriprasad copy tunes in HGPK

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే దేవిశ్రీప్రసాదే అంటారు అంతా.. పెద్ద హీరో సినిమా కి పనిచేయాలంటే దేవినే అందరికి గుర్తొస్తాడు. అందరి అంచనాలకు తగ్గట్లే దేవి మ్యూజిక్ కూడా ఇస్తాడు.. కానీ కొద్దీ రోజుల నుండి పరిస్థితి మారింది.. థమన్ వచ్చాక దేవి కి అవకాశాలు తగ్గాయి.. తక్కువ టైం లోనే థమన్ స్పీడు తో దూసుకుపోవడం దేవి అవకాశాలు తగ్గిపోవడం జరిగిపోయాయి.. అయినా దేవి కె అభిమానులెక్కువ.. దేవి పాటలకే వైన్ శ్రోతలెక్కువ.. అలాటి దేవి పై కాపీ మారక పడింది. ఇలాంటి మారక కొత్తదేం కాకపోయినా అవకాశాల్లేని ఈ టైం లో ఇలాంటి న్యూస్ రావడం దేవికి ప్రాబ్లం.. మరి ఆ కాపీ మారక ఏంటంటే..

తాజాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన హలో గురు ప్రేమ కోసమే సినిమా పాటలు నిన్ననే రిలీజ్ అయ్యాయి.. ఈ ఆల్బమ్ మొత్తం ఐదు పాటలుండగా, టైటిల్ పేరు తో సాగిన పాట ఇదివరకు దేవి శ్రీ ప్రసాద్ చేసిన ‘రారండోయ్’ సినిమా లోని ‘భ్రమరాంభకు’ అనే సాంగ్ తో పోలికలున్నాయి.. అందులో వాడిన మ్యూజిక్, గాత్రాన్ని, ట్యూన్ కూడా వాడి దేవిశ్రీ అడ్డంగా దొరికిపోయాడు.. దేవిశ్రీ ఇలా చేయడం అభిమానులకి నచ్చడం లేదు.. ఇక ఆల్బమ్ లోని మిగితా పాటలు ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు.. తోటి మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెష్ ట్యూన్స్ తో దూసుకుపోతుంటే దేవి శ్రీ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇలా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం అందరిని కలవరానికి గురిచేస్తుంది.. ఇకనైనా పాత దేవి మళ్ళీ ట్రాక్ లోకి వస్తే అందరు సంతోషిస్తారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here