ప్రారంభమైన యువనేస్తాం.. ఏపీ లో యువతకి సీఎం హస్తం..!!

12
cm starts mukhyamantri yuvaneshtham
cm starts mukhyamantri yuvaneshtham

నిరుద్యోగ యువతకు వరప్రదాయిని అయిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమం ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు..ఈ కార్యక్రమానికి భారీగా యువత తరలి రాగ, వారితో చంద్రబాబు ముఖాముఖీ లో పాల్గొన్నారు.. యువతకు ఈ యువనేస్తం ఒక చక్కని ఫ్లాట్ ఫార్మ్ లా ఉపయోగపడాలని పేర్కొన్నారు.. ప్రముఖ నైపుణ్య శిక్షణ సంస్థలతో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా యువతకు ప్లేసెమెంట్స్ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు..

దేశంలో ఉన్న యువత సేవలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు.. ఈ పథకం కిందా నిరుద్యోగులకు భృతిగా నెలకు 1000 రూపాయలు అందజేయబడుతుందని పేర్కొన్నారు. ప్రతినెలా 3 వ తేదీన బ్యాంకులో ఈ డబ్బు జమ అవుతుందని అన్నారు.. ప్రపంచాల్లో ఎక్కడా లేనటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here