జోరుమీదున్న రోహిత్ సేన.. బంగ్లాను చిత్తు..!!

99
india beat bangladesh
india beat bangladesh

ఆసియ కప్ లో ఎదురులేకుండా రోహిత్ సేన ముందుకు దూసుకుపోతుంది.. ఇప్పటికే హాంక్ కాంగ్ , పాకిస్థాన్ లను ఓడించి సూపర్ 4 కి చేరుకున్న టీం ఇండియా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అలవోకగా గెలిచింది.. హార్దిక్ పాండ్య గాయంతో వెనుదిరగగా అతని స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్ ను మట్టి కురిపించాడు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎక్కడా తడబడలేదు.. మొదటినుంచి బంగ్లాదేశ్ పై పై చేయి సాధించింది.

49.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 173 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన టీం ఇండియా 36.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.. కెప్టెన్ రోహిత్ శర్మ (104 బంతుల్లో 5 ఫోరులు , 3 సిక్సర్లు) 83 నాటౌట్ గా నిలిచాడు.. మరోవైపు ధావన్ (40) ధోని (33) పరుగులు చేశారు.. బౌలింగ్ విభాగంలో జడేజా 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా , భువనేశ్వర్ లు చెరో మూడు వికెట్లను పంచుకున్నారు.. తదుపరి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆదివారం ఆడనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here