విలన్ గా రానున్న బాలకృష్ణ..!!

301
balakrishna as villain
balakrishna as villain

నటుడిగా నందమూరి బాలకృష్ణ విశ్వరూపం ఏంటో అందరికి తెలుసు.. అయన డైలాగ్ చెప్తే థియేటర్ లో ప్రేక్షకులు విజిల్స్ వేయాల్సిందే.. తొడగొడితే బాక్సాఫీస్ బద్దలు కావలసిందే. టోటల్ గా అయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..బాలనటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయన తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను ఉర్రుతలూగించారు.

ఇక అయన విలన్ గానూ అభిమానులని మెప్పించనున్నారట.. ఈ విషయం ఆయనే వెల్లడించారు.. తాజాగా సైమా అవార్డ్స్ ఫంక్షన్ దుబాయ్ జరిగిన సంగతి తెలిసిందే. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కి గానూ అయన కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విలన్ పాత్రలు చేయడానికి తాను సిద్ధమే అన్నారు.. అయితే ప్రతినాయక పాత్రలు పోషిస్తే తన మీద అభిమానులు కేసులు పెడతారేమో అని స్టేజి పైన నవ్వుల పూవులు పూయించారు..

ఏదేమైనా తాను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని బాలయ్య చెప్పారు.. మరి మూస పాత్రలు కాకుండా వెరైటీ క్యారెక్టరైజషన్ ఉన్న విలన్ పాత్రలు పట్టుకుని బాలయ్య దగ్గరికి ఎవరు ముందుగా వెళతారో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here