కులాంతర వివాహం చేసుకున్న మరో జంట భయం ..!!

31
Lovers Seek Police Protection
Lovers Seek Police Protection

ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాలని కాదు యావత్ దేశాన్నే ఓ కుదుపు కుదిపేసింది.. ఇతర కులం వాడు తన కూతురిని పెళ్లిచేసుకున్నాడని అమృత తండ్రి అల్లుడు ప్రణయ్ ని హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు ను పూర్తిగా ఛేదించిన పోలీసులు మర్డర్ చేసిన వ్యక్తిని బీహార్ లో పట్టుకున్నారు.. కాగా నేడు కోర్టు లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉదంతం తో మరికొందరు కులాంతర వివాహం చేసుకున్న దంపతులు తమకు ప్రాణభయం ఉన్నట్లు వెల్లడిస్తున్నారు.. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు కు చెందిన శివదీప్తి రెడ్డి, కడపకు చెందిన విజయ్ కుమార్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత జులై 26 న వివాహం చేసుకున్నారు. కాగా దీప్తి రెడ్డి తన కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని, ప్రణయ్ హత్య తర్వాత తమకు కూడా అలాంటిది జరుగుతుందేమోనని భయంతో మీడియా కి తెలియాజేస్తున్నామని వెల్లడించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here