ఇండియా వర్సెస్ పాకిస్థాన్ : దాయాదుల పోరంటే అంతే మరీ..

27
india vs pak asiacup 2018
india vs pak asiacup 2018

చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే ఎవరికీ ఆసక్తి ఉండదు చెప్పండి..ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎవరైనా టీవీ ల ముందు అతుక్కుపోవాల్సిందే.. ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు జరగకపోతున్నప్పటికీ ఆసియ కప్ లో రెండు జట్లు తలపడుతున్నాయంటే ఇతరదేశాల్లో కూడా ఆసక్తి నెలకొంది. దుబాయ్ వేదికగా ఈరోజు సాయంత్రం ఇరు జట్లు తలపడనున్నాయి.. కాగా ఈ మ్యాచ్ కి పాకిస్థాన్ నయా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవుతారని తెలుస్తుంది.. సౌదీ అరేబియా కి రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ అక్కడినుంచి దుబాయ్ లో జరిగే మ్యాచ్ కి హాజరవుతారని పాక్ మీడియా వెల్లడించింది. గత ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ని ఓడించి పాక్ కప్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి పాకిస్థాన్ మెడలు వంచాలని భారత్ భావిస్తుండగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here