డిసెంబర్ 21 న శర్వా ‘పడి పడి లేచే మనసు’.. !!

13
padi padi leche manasu release date
padi padi leche manasu release date

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘పడి పడి లేచే మనసు’.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజగా నేపాల్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రధాన పాత్రలకు సంబందించిన కీలకమైన ఎపిసోడ్స్ ని, ఒక పాటను ఇక్కడ చిత్రీకరించారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ. ఈ నెల లో టాకీ పార్ట్ ని మొత్తం పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి.. వచ్చే నెలలో మిగిలిన రెండు పాటలను చిత్రీకరించే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి.. అన్నారు.. మురళి శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 న సినిమా రిలీజ్ కాబోతుంది..

తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్.

సాంకేతిక విభాగం :
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
డీఓపీ : జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరన్
సాహిత్యం: కృష్ణ కాంత్
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here