అక్కినేని నట వారసుడి గా వచ్చిన అక్కినేని అఖిల్ కి తొలి విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.. తొలి సినిమా అఖిల్ తో డిజాస్టర్ ని మూటగట్టుకున్న అఖిల్, రెండో సినిమా హలో తో విజయాన్ని అందుకోలేకపోయాడు..దాంతో మూడో సినిమా మిస్టర్ మజ్ను సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు..
తొలి సినిమా తొలిప్రేమ తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా పై ఫ్లాప్ ముద్ర పడేలా ఉందని అక్కినేని అభిమానులు వాపోతున్నారు.. అందుకు కారణం ఇదే లైన్ తో గతం లో ఓ సినిమా వచ్చి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది.. లాంగెస్ట్ రిలేషన్స్ మీద నమ్మకం లేని హీరో కథ వస్తున్న ఈ సినిమా స్టోరీ ఇది వరకు రామ్ చరణ్ ఆరంజ్ సినిమా లో రాగ ఆ సినిమా అటు నిర్మాతకు, దర్శకునికి, హీరో కి భారీ ఫ్లాప్ ని తెచ్చిపెట్టింది..
కాగా ఇదే స్టోరీ లైన్ తో అఖిల్ వస్తుండగా ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని తప్పక ఈ సినిమా అఖిల్ అభిమానులను నిరాశపరుస్తుడని చెప్తున్నారు.. ఒకసారి వచ్చిన లైన్ ని, ఫ్లాప్ అయినా స్టోరీ తో అఖిల్ సినిమా చేయడం అందరికి ఆశ్చర్యకరంగానే ఉన్నా ఆరంజ్ సినిమా కి ఈ సినిమా కి చాల తేడా ఉందని చిత్ర యూనిట్ చెప్తున్నా మాట..
ఇవన్నీ పక్కనపెడితే అఖిల్ సినిమా కెరీర్ ఓ గాడిలో పడాలన్నా, ఇంకో సినిమా పై మంచి అభిప్రాయాలూ రావాలన్నా అఖిల్ కి ఈ సినిమా తో హిట్ పడాల్సిన అవసరముంది.. ఈ నేపథ్యంలో ఈ నెల 25 న రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పిస్తుందో చూద్దాం..