బాలయ్య ని కాదని అఖిల్ తో బోయపాటి సినిమా..!!

0
83
akhil next movie with boyapati
akhil next movie with boyapati

బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా తో సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాడు.. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా లో రామ్ చరణ్ నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆ సినిమా ఆ అంచనాలను మించింది.. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో ఓ సినిమా చేస్తన్నట్లు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ లో వెల్లడైన సంగతి తెలిసిందే..

వీరి కలయిక లో సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ పై కన్నేశారు.. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో తన తనయుడు మోక్షజ్ఞ ను వెండితెరకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారు.. కానీ బాలయ్య ఎత్తులు ఏవీ పనిచేయనట్లు కనిపిస్తున్నాయి.. బాలయ్య తో సినిమా పూర్తి కాగానే బోయపాటి అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది..

నిజానికి బాలకృష్ణ కన్నా ముందే అఖిల్ తో బోయపాటి సినిమా చేయాలి కానీ బాలయ్య అడగడం బోయపాటి కాదనడంతో అఖిల్ సినిమా ను పోస్ట్ చేశాడట. కానీ ఈసారి అఖిల్ కి ఇచ్చిన మాటను ఏవిధంగా దాటేయకుండా బాలకృష్ణ సినిమా తర్వాత అఖిల్ తో సినిమా చేస్తానని మాటిచ్చాడట.. మరి బాలకృష్ణ వేరే డైరెక్టర్ తో మోక్షజ్ఞ ను లాంచ్ చేస్తాడా లేదా బోయపాటి వచ్చే అంత వరకు ఆగుతాడా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here