ఎన్టీఆర్ కి థియేటర్స్ లేనే లేవట..పెట్టా నిర్మాత స్టయిల్లో బాలకృష్ణ ఫైర్..!!

81
Less theaters For Ntr biopic
Less theaters For Ntr biopic

తెలుగునాడు లో ఎన్నడూ లేని కొత్త కష్టాలు ఈ సంక్రాంతి కి తలెత్తుతున్నాయి.. అందుకు కారణం ఈ సీజన్ లో ఒకేసారి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అవడం.. రామ్ చరణ్ వినయవిధేయ రామ, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, వెంకటేష్, వరుణ్ తేజ్ ల F2, రజినీకాంత్ ల పెట్టా. వేటికవే ఈ సినిమా లు ప్రత్యేకం.. పెద్ద పెద్ద స్టార్స్ ఈ సీజన్ కి వచ్చి ప్రేక్షకులను అలరించాలనేది వాళ్ళ ప్లాన్.. అయితే ఇన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అవడంతో థియేటర్స్ సమస్య మొదలైంది.. నా సినిమా కు కావాలంటే నా సినిమా కు కావాలని నాలుగు సినిమా ల నిర్మాతలు గొడవపెట్టేసుకుంటున్నారు..

మొన్నటికి మొన్న పెట్టా సినిమా నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ లపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.. అందుకు బదులుగా దిల్ రాజు కూడా అతని వ్యాఖ్యలను తప్పుబట్టి సమాధానం చెప్పాడు.. అయితే తాజగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కి థియేటర్స్ సమస్య మొదలైందట.. అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా యూవీ క్రియేషన్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.. F2 సినిమా దిల్ రాజు చేతిలో ఉంది.. మొత్తం థియేటర్స్ అన్ని వీళ్ళ చేతిలోనే ఉండడంతో పెట్టా సినిమా తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా థియేటర్స్ కష్టాలు తప్పట్లేదు..దాంతో ఈ పరిస్థితిపై బాలకృష్ణ కొంచెం ఘరమ్ ఘరమ్ గా ఉన్నాడట.. రజనీకాంత్ , బాలకృష్ణ సినిమాలకే థియేటర్స్ కష్టాలు తప్పట్లేదు… ఇక చిన్న హీరోలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here