నీలాగా ఆలోచిస్తే నువ్వుండవు – దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్..!!

48
Dilraju warning to Ashok Vallabhaneni
Dilraju warning to Ashok Vallabhaneni

దిల్ రాజు , అల్లు అరవింద్ లపై నోరు పారేసుకున్న పెట్టా సినిమా ప్రొడ్యూసర్ కి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారు.. ఈ సీజన్ లో తెలుగు సినిమా లకే థియేటర్స్ లేక సతమతమవుతుంటే ఒక డబ్బింగ్ సినిమా కి ఎలా థియేటర్స్ ఇస్తామని అన్నారు.. ఆరునెల క్రితం రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయినా సినిమాలకు కాకుండా నెల ముందు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాకి థియేటర్స్ అధికమొత్తంలో ఇవ్వడం కుదరదని , అయినా సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలను కాదని, ఇతర భాష సినిమాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు..

పేట నిర్మాతలు ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారని, నేను అలా మాట్లాడగలనని కాకపోతే నాకు ఒక క్యారెక్టర్ ఉంది.. అందుకే మంచి మాట్లాడి ఈ సమస్య ను పరిష్కరించాలని మీడియా వారికీ తెలియజేస్తున్నాను అన్నారు..తెలుగులో వస్తున్న భరి చిత్రాలకే థియేటర్స్ అడ్జస్ట్ చేయలేక చస్తుంటే ఇతరభాష సినిమాలకు థియేటర్స్ ఎలా ఇవ్వగలం అన్నారు.. ఇక తాజాగా దిల్ రాజు వ్యాఖ్యలకు అందరి దగ్గరినుంచి మద్దతు లభిస్తుంది.. అశోక్ వల్లభనేని అలా మాట్లాడడం సరికాదని ఆయనకు చివాట్లు పడుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here