నా సినిమా ఏ సినిమా కి పోటీ కాదు – రామ్ చరణ్..!!

187
ram charan about ntr biopic and F2
ram charan about ntr biopic and F2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన వినయవిధేయ రామ సినిమా ఈ సంక్రాతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.. కాగా ఈ సినిమా తో పాటే మరో మూడు పెద్ద సినిమాలు సంక్రాంతి కానుకగా రానున్నాయి.. వెంకటేష్ F2 , బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, రజినీకాంత్ పెట్టా సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి..

అయితే ఈ సినిమా లతో పాటు మీ సినిమాకూడా రిలీజ్ అవుతుంది..ఏ సినిమా మీకు గట్టి పోటీ ఇస్తుందని చెర్రి కి ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్న ఎదురవగా అన్ని సినిమా లు బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.. ఏ సినిమా కి ఏదీ పోటీ కాదు.. సంక్రాంతి సీజన్ లో ఎన్ని పెద్ద సినిమాలు అయినా రిలీజ్ అవ్వొచ్చు.. బాగుంటే తప్పకుండా సినిమాను జనాలు ఆదరిస్తరన్నారు.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here