మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు.. పెట్టా నిర్మాత కు మెగా ప్రొడ్యూసర్ వార్నింగ్..!!

52
banny vas comments on vallabhaneni ashok
banny vas comments on vallabhaneni ashok

నిన్న పెట్టా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవేశానికి లోనైన ఆ సినిమా నిర్మాత అశోక్ వల్లభనేని కి సర్వత్ర సపోర్ట్ లభిస్తున్న మెగా కాంపౌండ్ నుంచి వ్యతిరేకత వస్తుంది.. తమిళంలో నిర్మితమైన పెట్టా సినిమా ని తెలుగులో అశోక్ వల్లభనేని రిలీజ్ చేస్తున్నారు.. కాగా ఈ సినిమా కి సంబంధించి దియేటర్స్ విషయంలో అన్యాయం చేస్తున్నారని, తాము రిలీజ్ చేస్తున్న సినిమాలకు ఎక్కువ ధియేటర్స్ ఇచ్చి మా సినిమా కు అన్యాయం చేస్తున్నారని అయన ఆవేదన చెందగా తీవ్ర స్థాయిలో అల్లుఅరవింద్, దిల్ రాజు , యూవీ క్రియేషన్స్ బ్యానర్ లపై కామెంట్స్ చేశారు..

కాగా అయన చేసిన వ్యాఖ్యలకు మెగా ప్రొడ్యూసర్ బన్ని వాస్ స్పందించారు.. అదే కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్ కూడా దియేటర్ల మాఫియా ని హతమార్చాలని కోరగా బన్నీ వాస్ తమరు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాటలు జరుతున్నారు.. మేము సహనం కోల్పోయే స్థితికి తెస్తున్నారు.. తిట్టాలి అంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింగి అని ట్వీట్ చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here