అందుకే తేజ ని తీసేశాం – ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుని మార్పు పై బాలకృష్ణ.!!

56
balakrishna about removing teja from ntr biopic
balakrishna about removing teja from ntr biopic

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ పనులని వేగవంతం చేసింది.. చిత్రంలో నటిస్తున్న నటీనటులందరూ ఒక్కొక్కరుగా సినిమా విశేషాలను చెప్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు..

ఈ నేపథ్యంలో సినిమా గురించి బాలకృష్ణ విశేషాలను చెప్తూ ఈ చిత్ర దర్శకుడి మార్పు గురించి తెలియజేశారు.. మొదట్లో ఈ సినిమా కి తేజ ని దర్శకుడిగా ప్రకటించారు ఏమైందో తెలీదు కానీ తేజ తప్పుకున్నాడు.. ఆ తర్వాత బాలకృష్ణ క్రిష్ ని రంగంలోకి దించాడు.. ఇప్పుడు తేజ ని తప్పించడానికి కారణం వెల్లడించాడు.. ఇంత బరువును తను మోయలేకపోతున్నాడని తేజ చెప్పినందు వల్లే తేజ ని సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందని వెల్లడించారు..ఇక భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెన్సార్ ఇటీవలే కంప్లీట్ చేసుకుని యు సర్టిఫికేట్ పొందింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here