నా అనుమతి లేకుండానే వర్మ సినిమా తీస్తున్నాడు..ఏమవుద్దో నాకు తెలీదు..!!

33
balakrishna about lakshmis ntr movie
balakrishna about lakshmis ntr movie

ఎన్టీఆర్ బయోపిక్ కి దీటుగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఎన్ని విమర్శలోచ్చినా వర్మ మాత్రం తన పంథా లో సినిమా చేస్తూ రిలీజ్ కి అంత రెడీ చేసుకుంటున్నాడు.. జనవరి 24 న సినిమా రిలీజ్ అవడానికి సిద్ధం అవగా ఈ సినిమా పై ఇప్పటికే టిడిపి నేతలు కేసులు నమోదు చేస్తుండగా, వర్మ మాత్రం వారికి ధీటైన సమాధానాలు చెప్తున్నాడు..

అయితే ఈ సినిమాపై బాలకృష్ణ తొలిసారి స్పందించారు. నా అనుమతి లేకుండా వర్మ సినిమా తీస్తున్నాడు.. మా వాళ్ళ ను కూడా ఎం అడగలేదని విన్నాను.. నేనైతే అందరి అనుమతి, ఇష్టనుసరంగానే సినిమా తీస్తున్నాను అని చెప్పారు.. అసలు వర్మ ఎం కథ తీస్తున్నారో , ఏ కోణం నుంచి సినిమా తీస్తున్నారో తనకు తెలీదని, ఈ సినిమా పై నా రియాక్షన్ కన్నా ప్రేక్షకులు, అభిమానుల రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here