క్రిష్ తో కంగనా గొడవకి కారణం బాలకృష్ణ నేనట..!!

63

గమ్యం సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్రిష్ ఆ తర్వాత కంచే సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారారు.. సామజిక స్పృహ ఉన్న సినిమా తీస్తూ తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న అయన ఆ సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చేయన్న్నారు.. అయన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో పలు సినిమా లు చేసి అక్కడ సక్సెస్ అయ్యారు.. ఆకోవలోనే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మణికర్ణిక సినిమాకి దర్శకత్వం వహించారు.. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమాని మధ్యలోనే క్రిష్ వదిలేసారు. తర్వాతి సినిమా ని కంగనా నే డైరెక్ట్ చేసి సినిమా ని రిలీజ్ చేసేంతవరకు తీసుకొచ్చింది..

అయితే క్రిష్ మధ్య లో రావడానికి కంగనా తో భేదాభిప్రాయాలు రావడమే అని తెలుస్తుంది. ఇరువైపుల ఎవరి వాదనలు వారికున్నాయి.. సినిమా ని మధ్యలోనే వదిలేసి వెళ్లి మళ్ళీ రమ్మంటే రానని అన్నాడని కంగనా తరపు వాళ్ళు చెప్తుంటే క్రిష్ వైపు మాత్రం షూటింగ్ పార్ట్ వరకే ఉండి తర్వాత వెళతానని క్రిష్ ముందే చెప్పగా అలాగే చివరి టేక్ వరకు సినిమా మొత్తం తీసి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ని మొదలుపెట్టారు. కానీ తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ పిలవగా ఎన్టీఆర్ పనుల్లో పడి క్రిష్ వెళ్ళలేకపోవడం తో వారు బాగా హార్ట్ అయ్యారని ఆ కోపంతోనే టైటిల్ లో క్రిష్ తో పాటే
కంగనా పేరు వేసుకుందని చెప్తున్నారు.. ఏదేమైనా ఈ రెండు సినిమాలు సంక్రాతి కి పోటీపడుతున్నాయి.. ఏ సినిమా హిట్ అవుతుందో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here