రాజమౌళి కి బంపర్ ఆఫర్.. ఇండియా నే షేక్ చేసే సినిమా..!!

36
rajamouli movie with rajinikanth
rajamouli movie with rajinikanth

బాహుబలి తర్వాత రాజమౌళి RRR సినిమా చేస్తున్నాడు..రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.. బాహుబలి సినిమా తో తన పేరును దేశం మొత్తం వినిపించేలా చేసుకున్న రాజమౌళి చేస్తున్న ఈ సినిమా పై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది అంటే సినిమా ఎ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటె రాజమౌళి చేయబోయే తర్వాతి సినిమా గురించిఅటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ ఓ వార్త వినిపిస్తుంది..

సూపర్ స్టార్ రజినీకాంత్ తో రాజమౌళి తన తర్వాత సినిమా చేస్తారని అంటున్నారు.. ప్రస్తుతం పెట్టా సినిమా తో సంక్రాంతికి రాబోతున్న రజినీకాంత్ ఆ తర్వాత మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడు.. ఈ సినిమా తర్వాత రాజమౌళి తో సినిమా చేస్తారని అంటున్నారు.. సమ్మర్ లో ఈ సినిమా మొదలవుతుందని, ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది.. అన్ని ఓకే అయి సినిమా పట్టలేక్కితే దేశం మొత్తం ఎదురుచూసే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here