ఒక్క కట్ కూడా లేకుండా.. సెన్సార్ పూర్తి చేసిన “ఎన్టీఆర్-కథానాయకుడు..!!

20
NTR Kathanayakudu movie release date
NTR Kathanayakudu movie release date

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న “ఎన్టీఆర్-కథానాయకుడు” చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ‘U’ సర్టిఫికేట్ ని పొందింది.. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..

విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి , సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన దక్కించుకోగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here