కేజిఎఫ్ 2 లో విలన్ గా సంజయ్ దత్.!!

56
sanjay dutt is in KGF2
sanjay dutt is in KGF2

కన్నడ సినీ చరిత్రను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమా కేజిఎఫ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అన్ని భాషల్లో విడుదల అయిన సినిమా ను భాషాభేదం లేకుండా అన్ని భాషల ప్రజలు చూసి విజయవంతం చేశారు. చూసిన ప్రతి ఒక్కరు సినిమా పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండడంతో రెండవ పార్ట్ పై అందరి కళ్ళు పడ్డాయి.. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు విరమిస్తున్నారట.. మొదటి పార్ట్ కి వచ్చిన రెస్పాన్సు చూసాక రెండవ పార్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసి పవర్ ప్యాకేజీ గా సినిమా ను 2020 ను అందించాబోతున్నారట..

అయితే ఈ సెకండ్ పార్ట్ లో ఎవరు ఊహించని విషయాలు ఉంటాయట.. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ తమిళ నటులనే ఉన్నారు. ఈ సెకండ్ పార్ట్ లో ఇతర భాషల నటులు కూడా నటించబోతున్నారట.. ముఖ్యంగా ఈ సినిమా లో విలన్ గా సంజయ్ దత్ నటించబోతున్నారట.. క్రూరమైన విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నారట.. ఇదే నిజమైతే కేజిఎఫ్ బాహుబలి లా ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకోవడం ఖాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here