ఎన్టీఆర్ లేకపోవడానికి బాలకృష్ణ నే కారణమట..!!

43
reason for ntr not in ntr biopic
reason for ntr not in ntr biopic

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా జనవరి 9 న రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.. ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాలున్న ఈ సినిమా పై అటు బాలకృష్ణ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నాడు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర గా వస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్, రానా, ప్రకాష్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ నిత్యామీనన్ , కళ్యాణ్ రామ్, సుమంత్ తదితరులు నటిస్తున్నారు..

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో జూ.ఎన్టీఆర్ నటించకపోవడానికి కారణం చెప్పాడు కళ్యాణ్ రామ్.. తాతగారి బయోపిక్ లో ఏ పాత్ర ఇచ్చిన ఎన్టీఆర్ చేసుండేవాడని,కానీ నందమూరి అభిమానులు ఎన్టీఆర్ కి ఇంత చిన్న పాత్ర ఇచ్చారా అని ఫీల్ అయ్యేవారని బాలకృష్ణ నిర్ణయాన్ని సమర్ధించారు.. ఇంకా బాలకృష్ణ జూ.ఎన్టీఆర్ కి ఎంతో మర్యాద ఇచ్చేవారని అందుకే సినిమా ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా పిలిపించి ఎన్టీఆర్ తోనే పాటలు రిలీజ్ చేయించాడని చెప్పారు.. అసలు అంతకన్నా ఇంకేం కావాలి అని అన్నారు. కాగ ఎన్టీఆర్ మహానాయకుడు తో రెండో పార్ట్ ఫిబ్రవరి లో విడుదల కానుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here