కాజల్ కి ఘోర అవమానం..!!

144
kajal frastrate about jet airways
kajal frastrate about jet airways
టాలీవుడ్ బ్యూటీ కాజల్ కి జెట్ ఎయిర్ వేస్ లో ఘోర అవమానం ఎదురైంది.. ముంబై ఎయిర్ పోర్ట్ కు 75 నిమిషాల ముందే తాను చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయినా మొయిన్ అనే వ్యక్తి తన సమయాన్ని వృధా చేశాడని ఆరోపించింది.. తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్మినల్ వద్దకు విమానాన్ని తీసుకొచ్చి మరో ముప్పై నిముషాలు పార్క్ చేశాడని మండిపడింది. అంతేకాదు గంట సేపు డోర్లను కూడా మూసి ఉంచారని మండిపడింది..
 
ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపింది.. మొత్తానికి ప్రయాణికుల పట్ల చాల దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం చేసింది.. గతంలో కూడా జెట్ ఎయిర్ వేస్ పై పలువురు సెలెబ్రిటీలు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది..  ఆమె గత చిత్రం కవచం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here