శంకర్ , హృతిక్ ల సినిమా బాలీవుడ్ సెన్సేషన్ అయ్యేనా..!!

26
Hrithik Roshan movie with shankar
Hrithik Roshan movie with shankar

దర్శకుడు శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది.. ఈమేరకు బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.. రోబో సినిమా తో శంకర్ గురించి ఇండియా లో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు.. ఆ సినిమా విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. నిజానికి రోబో లో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర హృతిక్ చేయాల్సిందే.. కానీ డేట్స్ అడ్జస్ట్ అవక చేయలేదు.. తర్వాత ఓ ఫుల్ సినిమా చేస్తానని హృతిక్ మాటిచ్చాడట..

దాంతో ప్రస్తుతం కమల్ తో భారతీయుడు 2 చేస్తున్న శంకర్ ఈ సినిమా తర్వాత హృతిక్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట..ఇప్పటికే హృతిక్ ఓ సైటిఫిక్ థ్రిల్లర్ స్టోరీ ని వినిపించడం ఆయనకు నచ్చడం జరిగిపోయాయట.. కథ కూడా చాల ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా నిర్మించడానికి చాల మంది పోటీపడుతున్న నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.. ఇక ఈనెల 18 నుంచి భారతీయుడు 2 సినిమా రెగ్యులర్ సినిమా షూటింగ్ జరగనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here