ఆ బయోపిక్ పై నిరసన ల సెగ.. కేసు నమోదు..!!

47
Accidental Prime Minister issue
Accidental Prime Minister issue
ఇండియా లో బయోపిక్ సినిమాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి.. స్పోర్ట్స్ స్టార్స్ దగ్గరినుంచి సినిమా స్టార్స్ , పొలిటికల్ లీడర్స్ వరకు అందరి జీవితాలని తెరకెక్కిస్తున్నారు.. టాలీవుడ్ లో అయితే ప్రస్తుతం అరడజను బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్, మహానటి , సైరా, ఇంకొన్ని సెట్స్ మీద ఉన్నాయి..
 
అయితే ఎలాంటి వివాదాలు లేని బయోపిక్ లకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కాంట్రవర్సి ఉన్న బయోపిక్ లు తీస్తే వారికి సపోర్ట్ చేసే వారు నిరసన చేయడం మనం గతంలో పద్మావతి టైం లో చూశాం.. అయితే తాజాగా మరో బయోపిక్ చిత్రీకరణ వివాదాస్పదమైంది.. మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితం పై ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ‘ అనే పేరు తో ఓ సినిమా రవుతుంది.. అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్ర లో నటించారు..
 
కాగా అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్రలో నటించి ఆయన్ను అవమానించారని బీహార్ కి చెందిన ఓజా కేసు నమోదు చేశారు.. మన్మోహన్ సింగ్ ప్రధాన సలహా దారుడు సంజయ్ బారు పాత్రలో అక్షయ ఖన్నా, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ , ప్రియాంక వాద్రా పాత్రల్లో నటించిన నటులు కూడా అవమానించేలా ఉన్నారని కేసులో పేర్కొన్నారు.. ఈనెల 8 న దీనిపై విచారణ జరగనుంది.. జనవరి 11 న ఈ సినిమా రిలీజ్ కానుంది.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here