బోయపాటి కండిషన్స్ కి తలొగ్గిన బాలయ్య… పొలిటికల్ సినిమా కు ఇది అవసరమేనట..!!

76
balakrishna lost weight for boyapati movie
balakrishna lost weight for boyapati movie
ఎన్టీఆర్ బయోపిక్ తో సంక్రాంతికి మనముందుకు రాబోతున్న బాలకృష్ణ  ఆ తర్వాత తాను చేయబోయే సినిమా ని ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ లో వెల్లండించిన సంగతి తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేశారు..
 
ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉంటున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం బాలకృష్ణ కు కూడా ఇలాంటి సినిమాలే అవసరం.. అయితే బోయపాటి పెట్టిన కండిషన్ కి బాలయ్య ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.. సినిమా లో పాత్ర కోసం 25 కేజీల బరువు తగ్గాలని చెప్పగా బాలయ్య కూడా షూట్ టైం వరకు తగ్గుతానని చెప్పారట..రకుల్ ని కానీ, కైరా అద్వానీ ని గానీ ఈ సినిమా లో హీరోయిన్ గా తీసుకొనున్నారట.. ఏప్రిల్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.. కాగా ఈ ఇద్దరి సినిమాలు సంక్రాంతిని పోటీపడుతున్నాయి.. జనవరి 9 న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కాగా, బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా జనవరి 12 న రిలీజ్ కాబోతుంది.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here