ఎన్ని నాటకాలాడినా నన్ను తొక్కేయలేరు – వరలక్ష్మి..!!

44
varalakshmi warning tamil industry
varalakshmi warning tamil industry
 
ప్రధాన పాత్రలతో, ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న విలక్షణ నటి వరలక్ష్మి ఎన్ని సార్లు చెప్పినా విశాల్ వ్యవహారం తనను వెంటాడుతూనే ఉంటుందని వెల్లడించింది.. గతంలో చాల సార్లు మేమిద్దరం స్నేహితులమని చెప్పినా తిప్పి తిప్పి అక్కడికే వచ్చేవారని, విశాల్ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాక కూడా రూమర్స్ అలానే స్ప్రెడ్ అయ్యాయని ఆమె వెల్లడించింది.. 
 
తాజాగా కూడా విశాల్ తో వరలక్ష్మి పెళ్లి అంటూ వార్తలు రావడంతో ఈ సారి వరలక్ష్మి ఘాటుగా స్పందించింది.. కొంతమంది పనికిమాలినవాళ్లు పనిగట్టుకుని మరీ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. నేనిప్పట్లో పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని కొంతమంది కలలు కలలు కంటున్నారు..  నేను ఎక్కడికి వెళ్లను,.. ఇక్కడే ఉంటాను.. సినిమాలు చేస్తూనే ఉంటాను.. నేను ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అవతలి వారికి అర్ధమయ్యే ఉంటుంది.. ఎన్ని నాటకాలాడిన నన్ను తొక్కేయ్యలేరు ” అని ఆమె స్పష్టం చేశారు.. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here