మళ్ళీ బాలీవుడ్ కి రానా.. ఈ సారి అదిరిపోయే ఎంట్రీ..!!

19
rana daggubati sign a bollywood movie
rana daggubati sign a bollywood movie
లీడర్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రానా తెలుగు వారికంటే బాలీవుడ్ లోనే ఎక్కువ పరిచయం అని చెప్పాలి.. ఎందుకంటే మొదట్లో అక్కడే ఎక్కువ సినిమా లు చేసేవాడు.. అడపాదడపా తెలుగు సినిమాలు చేసిన ఎక్కువ గుర్తింపు రాలేదు.. బాహుబలి తో ఇండియా మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయాడు మనోడు..నేనే రాజు నేనే మంత్రి తో తెలుగులో సోలో హీరో గా నిలదొక్కుకున్న ఈ పొడవాటి హీరో ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, హిరణ్య కశ్యప సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే రానా ఇమేజ్ ని మరింత పెంచే సినిమా ఒకటి చేయబోతున్నాడట.. అయితే అది తెలుగులో కాదు హిందీలో..
 
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమా సిరీస్ ఐన హౌస్ ఫుల్ కి నాలుగో పార్ట్ ఇప్పటికే సెట్స్ మీద ఉంది.. అక్షయ్ కుమార్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్ నటించిన ఈ మూవీ లో నానా పాటేకర్ రోల్ లో రానా నటించబోతున్నాడట.. వ్యక్తిగత కారణాల వాళ్ళ నానా పాటేకర్ ఈ సినిమా నుంచి తప్పుకోగా ఈ సినిమా డైరెక్టర్ ఏరికోరి మరీ  రానా ని ఎంపిక చేసుకున్నాడట..రానా కు బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ ఫాలోయింగ్ చూసే స్టార్ యాక్టర్ కి రాసుకున్న పాత్రకి రానా ని ఎంపిక చేసాడట..  మళ్ళీ బాలీవుడ్ లో పాగా వేయడానికి రానా తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటిదో సినిమా చూస్తే కానీ తెలీదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here