దిల్ రాజు తో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా..!!

36
prabhas new movie with dil raju
prabhas new movie with dil raju
బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.. ప్రభాస్ అంటే ఇండియా లో తెలీనివారుండరు.. ఒక్క సినిమాతోనే నేషనల్ వైజ్ స్టార్ హీరో గా మారిపోయాడు ప్రభాస్.. అవే అంచనాలతో ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు.. టాప్ టెక్నిషియన్స్ తో భారీ ఖర్చుతో రాబోతున్న ఈ సినిమా ఆగష్టు 15 న రానుంది.. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో ఓ సినిమా ని మొదలుపెట్టేశాడు.. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది.. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.. 
 
ఇక తాజాగా ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ చిత్రం పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఇటీవలే కెజిఎఫ్ చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తుండగా ఆ వార్తలకు బలాన్ని చేకూర్చే విషయం ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడం..ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన దిల్ రాజు ఈ సినిమా కోసం ప్రభాస్ తో కలవబోతున్నారు.. ఇటీవలే కెజిఎఫ్ చూసిన ప్రభాస్ ఆ దర్శకుడికి తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడా ఓ కథ ని రెడీ చేయమన్నాడట.. అందుకు తగ్గట్లే ఓ కథని రెడీ చేసి వినిపించగా ప్రభాస్ కూడా ఆ లైన్ కి సముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇటు దిల్ రాజు కూడా రెడీ గా ఉండడంతో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుందన్నమాట.. మరి ఈ సినిమా జాన్ సినిమా తో పాటే చేస్తాడా లేదా ఆ సినిమా తర్వాతే చేస్తాడా అనేది చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here