ఛార్మి ని వదిలితే గానీ పూరి కి హిట్ పడదంట…!!

53
charmi badluck for puri movies
charmi badluck for puri movies
టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ ప్రత్యేకమైన పేరుంది.. ప్రతి హీరో పూరి తో పనిచేయాలని కోరుకునేవారే.. పెద్ద డైరెక్టర్స్, హీరో లు సైతం పూరి టేకింగ్ ని, స్క్రిప్ట్ ని పొగిడేస్తారు.. అలాంటి పూరి గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫ్లాప్స్ అందిస్తున్నాడు.. మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా కూడా పూరి ఇప్పుడు కనిపించట్లేదు. వరుస ఫ్లాప్స్ తో ఇక తన కెరీర్ ముగించేస్తాడా అని అనుకున్నారు.. కానీ రామ్ తో సినిమా పూరి అభిమానులకు ఆశలు రేకెత్తించాయి..ఇదిలా ఉంటె పూరి సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం పూరి సినిమా ల్లో ఛార్మి ఇన్వాల్వ్ అవడమే అంటున్నారు కొందరు.. 
 
ఛార్మి రాకముందు పూరి ఫుల్ సక్సెస్ రేట్ ఉండేది.. ఆమె ఎంట్రీ తర్వాతే పూరి  డల్ అయిపోయాడు అంటున్నారు.. ఎప్పుడైతే పూరి కనెక్ట్స్ ని ఛార్మి చేతిలో పెట్టాడో అప్పటినుంచి పూరి సినిమాలు వరుస ఫ్లాప్స్ గా నిలిచాయి.. ప్రతి సినిమా లో ఛార్మి ఇన్వాల్వ్ మెంట్ , స్టోరీ లో కూడా వేలుపెట్టడంతో పూరి నేటివిటీ కోల్పోయి సినిమా లు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు.. అంతేకాదు మెహబూబా కోసం తన ఆస్తులు కూడా అమ్మేసినట్లు వార్తలు వచ్చాయి.. అయితే ఇంత జరిగిన పూరి ఛార్మి ని మాత్రం ఎందుకు వదలట్లేదు అర్థం కావట్లేదు.. ఇటీవలే రామ్ తో పూరి ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.. ఈ సినిమా కి సంబంధించిన ఓ పోస్టర్ లో పూరి తో ఛార్మి ఉండడం చూసి అందరు పెదవి విప్పుతున్నారు.. మరి పూరి తన పాత స్టయిల్లో రామ్ సినిమా తీస్తాడా లేదా ఇది ఆ ఫ్లాప్ ల సరసన చేరుతుందో చూడాలి..
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here