ఆ టైం లో చాల బాధపడ్డా.. ఎవరినైనా యిట్టె నమ్మేస్తాను – స్వాతి..!!

23
కలర్స్ షో తో పాపులర్ అయిన స్వాతి ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో  హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది.. అయితే తాజాగా ఆమె ఇంటర్వ్యూ లో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. ఈ మధ్య కొత్త దర్శకులు అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు.. అందువల్ల వాళ్ళతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అన్నారు.. తన పై వచ్చిన అభియోగాలను చెప్తు ఓ వీడియో తనదంటూ అప్పట్లో రూమర్స్ వచ్చినప్పుడు చాల బాధపడ్డాను అని చెప్పింది.. అందులో అమ్మాయికి కూడా నాలాగే పన్ను ఉండడంతో అందరు నేనే అనుకున్నారు.. కానీ ఆ టైం లో అందరు అలా అనేసరికి చాల బాధపడ్డాను.. సెట్స్ లో కూడా అందరు ఒకటే గుసగుసలాడుకునేవారు, అకమ్మాయిపై వచ్చిన అభియోగాన్ని నమ్మకుండా ఉండకపోగా, ఇలాంటి సూటి పోటీ మాటలతో గుచ్చడం ఎంతో బాధేసింది అన్నారు.. ఇక హీరోయిన్ గా చేస్తప్పుడు చాల ఎక్కువ మొత్తంలో పారితోషకం తీసుకునేదాన్నని వార్తలు వచ్చేవి అలా తీసుకునేదాన్నయితే బాగుండేదికాదా అనిపించేది.. నేను ఎవరినైనా యిట్టె నమ్మేస్తాను.. నమ్మి చాల ఇబ్బందిపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.. అని చెప్పుకొచ్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here