మొన్న బాలయ్య.. నిన్న బండ్ల గణేష్..నేడు రేవంత్ రెడ్డి నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..!!

4
nagababu comments on bandla ganesh
nagababu comments on bandla ganesh

బాలయ్య ఎవరో తెలీదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికి తెలిసిందే.. బాలయ్య అభిమానులు నాగబాబును తెగ ట్రోల్ చేసారు.. ఇంకా ఆ సమస్య సమిసిపోకముందే నాగబాబు బండ్ల గణేష్ పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు.. ఇటీవలే రాజకీయపరంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ తెలంగాణా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలవకపోతే పీక కోసుకుంటానని ఓ చానల్ సమక్షంలో చెప్పారు.. అయితే ఫలితం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రావడంతో బండ్ల గణేష్ కొన్ని రోజులు కనిపించలేదు.. ఓ సారి మీడియా కి చిక్కి అలా ఎవరైనా చేస్తారా అని సింపుల్ గా చెప్పి తప్పించుకున్నాడు.. ఇదే విషయం నాగబాబు ను అడిగితే ” బండ్ల గణేష్ కు తన పార్టీ పై ఎక్కువ నమ్మకంతో అలా మాట్లాడాడు.. అలా మాట్లాడడంలో తప్పు లేదు అయితే చెప్పినప్పుడే అనిపించింది గణేష్ అలా చేయదు.. గణేష్ ది మేకపోతు గాంభీర్యం.. ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ గెలుస్తుంది అని నాకు తెలుసు.. మేము మా పిల్లలం అందరం టి.ఆర్.ఎస్ కే ఓటేశాం.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల స్పీచ్ లు కామెడీగా అనిపించాయి.. రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగం ఇవన్నీ మంచి ఎంటర్ టైన్మెంట్ గా అనిపించాయి అంటూ చెప్పుకొచ్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here