అక్కినేని నాగ చైతన్య ‘ మజిలి’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల..!!

28
majili movie first look
majili movie first look

క్రేజీ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’..దేర్ ఈజ్ లవ్..దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. నాగ చైతన్య, సమంత లు ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఎంతో ఎమోషనల్ ఫీల్ ని కలిగిస్తుంది..రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘నిన్నుకోరి’ సినిమా తో మంచి విజయం సాధించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు..విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు.గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి..

సాంకేతిక నిపుణులు :
రచన మరియు దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here