జనగాం పై స్పష్టత వచ్చెన్..మహాకూటమిలో కాంప్రమైజ్..!!

0
35
janagama ticket for ponnala
janagama ticket for ponnala

ఇన్ని రోజులుగా జనగాం మహాకూటమి అభ్యర్థి పై ఉన్న సస్పెన్సు కి నేడు తెరలేచింది.. పొన్నాలకు ఆ సీటు ఖాయం అయిందని తెలుస్తుంది..మహాకూటమి పొత్తులో భాగంగా కోదండరాం జనగాం అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇన్ని రోజులు ప్రచారం జరగ బిసి లకు పార్టీ అన్యాయం చేస్తుందని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.. మరోవైపు కోదండ రామ్ కూడా పట్టువిడవకపోవడంతో అయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చించగా ఆఖరికి ఈ సీటు పొన్నాల కు గూటికి చేరింది.. కోదండరాం వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి పోటీచేయనున్నారని వార్తలువస్తున్నాయి.. నేడు ఉత్తకుమార్ రెడ్డి నామినేషన్ వేయడం తో మహాకూటమి అంతటా పండగ వాతావరణం నెలకొంది.. మరోవైపు ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయని 19 స్థానాలను గురించి ఎలాంటి సమాచారం అందలేదు.. వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తున్నారని అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here