26 నుంచి తెలంగాణ లో ప్రచారానికి బాలయ్య..!!

0
30

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఈనెల 26 నుంచి పాల్గొంటానని టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.. నేడు హైదరాబాద్ లో నందమూరి సుహాసిని నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా ఈ కార్యక్రమానికి నందమూరిబాలకృష్ణ జాజరయ్యారు.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ లో మహాకూటమి తరపున ప్రచారానికి ఈనెల 26 నుంచి వస్తానని అన్నారు.. అందరితో కలిసిపోయి పనిచేయడమే తమ లక్ష్యం అన్నారు.. రోడ్ షో లు, బహిరంగ సభలనే కాదు అన్ని విధాలుగా పార్టీ కి ఉపయోగపడే రీతిలో పనిచేస్తానని అన్నారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కలిసి కట్టుగా వెళ్లి మహాకూటమిని గెలిపించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అవసరమైతే తప్పకుండ ప్రచారానికి వస్తారు అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here