రజినీకాంత్ ‘పెట్టా’ పోస్టర్ విడుదల.. తలైవా మార్క్..!!

0
11
rajinikanth petta movie poster
rajinikanth petta movie poster
రోబో 2.౦ తర్వాత రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘పెట్టా’.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి  రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా సిమ్రాన్ కనిపిస్తుంది. విజయ్ సేతుపతి, బాబిసింహా, శశికుమార్, సీనియర్ దర్శకుడు మహేంద్రన్ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
ఇందులో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనికాధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కాగా ‘పేట్ట’ సంక్రాంతికి విడుదల చేస్తున్నామంటూ తాజాగా చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది.  రజనీ తాజా చిత్రం ‘2.ఓ’ నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. దీని తర్వాత తలైవా కొత్త సినిమాకు పచ్చజెండా ఊపారని ఇటీవల ప్రచారం జరిగింది. ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here