కెజిఎఫ్ కు ఎందుకంత క్రేజ్.. ఇన్ని వ్యూసా..!!

0
32
kgf trailer hits
kgf trailer hits
కన్నడ నటుడు యష్ హీరో గా వస్తున్న చిత్రం ‘ కేజిఎఫ్’.. లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానుంది.. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నెల 9న ఐదు భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్’ ట్రైలర్‌ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 6 మిలియన్ వ్యూవ్స్ సాధించింది. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న కేజీఎఫ్ సినిమా ట్రైలర్‌ మరెన్ని మిలియన్ల వ్యూవ్స్ సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here