కమల్ హాసన్ సినిమాలో మరో స్టార్ హీరో.. శంకర్ సినిమా మరో క్రేజ్..!!

0
38
కమల్ హసన్ నటించిన విశ్వరూపం 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అయన శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.. శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2.౦ సినిమా రిలీజ్ కి సిద్దమవడంతో శంకర్ కూడా త్వరలో కమల్ తో కలవనున్నారు.. చాల రోజుల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.. 
 
సమకాలిన రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించనుంది.. అయితే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.. కాగా మరో కీలకమైన పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శింబు ని తీసుకోనున్నారట.. పోలీస్ ఆఫీసర్ గా శింబు కనిపించనున్నదని తెలుస్తుంది.. ఈ సినిమాలో దుల్కర్, శింబు ల పాత్రలు హైలైట్ కానున్నాయని తెలుస్తుంది.. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here