ఇక విలన్ గా రానున్న రవితేజ..!!

0
34
సెకండ్ ఇన్నింగ్స్ లో రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ అంటోనీ’ నటిస్తున్నాడు.. కాగ ఈ చిత్రం ఈనెల 16న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీ గ ఉన్న రవితేజ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.. మూడు పాత్రలు వేటికవే వైవిధ్యభారితమైనవి.. ముఖ్యంగా అమర్ పాత్ర తనకెంతో నచ్చిందని చెప్తున్నాడు.. ఈ పాత్ర సినిమా కి హైలైట్ గా నిలవనుందట..
 
అయితే ఈ మధ్య ఎక్కడికెళ్ళినా రవితేజ కి నెగెటివ్ రొల్స్ ట్రై చేయొచ్చు కదా అనే ప్రశ్న ఎదురవుతుందట.. దాంతో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలనీ తనకు ఉందని , అయితే ఆ పాత్రలు సెహ్యడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు.. భవిష్యత్ లో తపకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తప్పక పోషిస్తాను అన్నారు.. కేవలం విలన్ పాత్రలే కాకుండా వైవిధ్యభరితమైన విలనిజం ఉన్న సినిమాల్లోనే నటిస్తాను అన్నారు.. ఇక రవితేజ కెరీర్ ఆరంభంలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here