ఎన్నికల సమయంలో కలకలం రేపుతున్న ‘ సెక్షన్ 49P ‘..!!

12
what is section49p
what is section49p

మన రాజ్యంగంలో ఉన్న అన్ని సెక్షన్ల గురించి , లా పుస్తకాల్లో ఉన్న అన్ని లా ల గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు..తెలిసినా సమయానికి అవి గుర్తుకురావు. అయితే తాజాగా విజయ్ సర్కార్ సినిమా ఎన్నికల సమయాన ఓ కీలక విషయాన్ని ప్రజలకు తెలిపింది.. అదే సెక్షన్ 49P .. ఇంతకీ ఈ సెక్షన్ 49P అంటే ఏంటి.. ఎవరైనా తమ ఓటు ను వేరే వారు వేశారని గుర్తిస్తే ఆ ఓటరు వెంటనే వెళ్లి పోలింగ్ బూతులో ఆ ఓటును వెంటనే తీసేయమని కోరవచ్చు.. అందుకు ఈ సెక్షన్ 49P సాక్ష్యం.. సినిమా విడుదల అయ్యాక అందరు ఈ సెక్షన్ 49P గురించే వెతకడం ప్రారంభించారు..రీసెంట్ గా గూగుల్ లో సెక్షన్ 49P గురించి అత్యధికంగా వెతికారని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఈ సినిమా పై ఎంత క్రేజ్ ఉందొ అర్థమవుతుంది.. ఇక ఈ సినిమా వివాదం ఇంకా తగ్గనట్లే కనిపిస్తుంది.. అధికార ప్రభుత్వం పై సెటైర్లుగా ఉన్నట్లు ఈ చిత్రంలో ని కొన్ని సన్నివేశాలు తొలగించాలని కోరగా ఆ సీన్లను కట్ చేసినట్లు మురుగదాస్ తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here