బాలీవుడ్ దర్శకుడితో తమన్నా చిత్రం..!!

0
4
tamannah with bollywood director
tamannah with bollywood director

గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ నెక్స్ట్ ఏంటి’.. బాలీవుడ్ లో ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.. లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని చిత్ర నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here