మురుగదాస్ సర్కార్ వర్సెస్ తమిళనాడు సర్కార్.. అసలేంటి వివాదం..!!

77
sarkar movie issue with government
sarkar movie issue with government

విజయ్ ఏ సినిమాలో నటించిన అది పెద్ద వివాదమే అవుతుంది.. అయన నటించిన మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమా అప్పట్లో పెద్ద వివాదమే అవగా, తాజాగా సర్కార్ సినిమా అంతకు మించి దుమారంరేగుతుంది.. సినిమా లో జయలలిత ను అవమానించే రీతిలో సీన్లు ఉన్నాయని ఆరోపణలు రాగ రీసెంట్ గా అధికార ప్రభుత్వం యంత్రాగాన్ని కించపరిచేవిధంగా ఉన్నాయని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి..

ఈ విషయంలో ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే అధికార ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు సినిమా విడుదల ను అడ్డుకునే ప్రయత్నం చేసారు..రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల వద్ద దాడికి దిగారు.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని ఫిర్యాదు చేశారు.. ఈ నేపథ్యంలో మురుగదాస్ నివాసానికి పోలీసులు రావడం కలకలం రేపింది..అతన్ని అరెస్ట్ చేసేందుకే వారు వచ్చి ఉంటారని అందరు భావించారు.. మురుగదాస్ అరెస్ట్ అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.. అయితే అది వాస్తవం కాదని, సినిమా ఫై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో అయన ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రత కలిపించేందుకు వచ్చినట్లు తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here